నంద్యాల జనసేన అభ్యర్థి ఇంట్లో ఏసీబీ సోదాలు..!


సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మళ్లీ నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన నివాసంలో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. పరిశ్రమల స్థాపన పేరిట బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని, తిరిగి వాటిని చెల్లించలేదన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు. రుణాల ఎగవేతపై బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ… ఎస్పీవై రెడ్డి ఇంటికి వెళ్లారు. బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారుల బృందం ఎస్పీవై రెడ్డి నివాసంలో పలు పత్రాలను పరిశీలించింది. మరోవైపు ఇదే సమయంలో నంది పైపుల పరిశ్రమకు చెందిన ఉన్నతోద్యోగుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. దీనిపై ఎస్పీవై రెడ్డి ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందనలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.