దర్శకేంద్రుడుకి శుభాకాంక్షల వెల్లువ..


టాలీవుడ్‌ దిగ్గజం, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైజయంతీ మూవీస్‌, క్రిష్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ మహేష్‌ బాబు కూడా రాఘవేంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్‌ తొలి చిత్రంతోనే రాఘవేంద్రరావు ఘన విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

‘హ్యాపీ బర్త్ డే మామయ్య. మీలాంటి గొప్ప దర్శకుడితో పని చేసిన అనుభవాన్ని మర్చిపోలేను. మీరెప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. ‘రాజకుమారుడు’ షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోను షేర్ చేశాడు.