HomeTelugu Newsఅంబరీశ్‌కు ప్రముఖల సంతాపం

అంబరీశ్‌కు ప్రముఖల సంతాపం

1 24ప్రముఖ కన్నడ నటుడు అంబరీశ్‌ మరణవార్త తెలీగానే చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అంబరీశ్‌ ఇంత త్వరగా తమని విడిచి వెళ్లిపోతారని అనుకోలేదని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సోషల్‌మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

‘ఓ గొప్ప వ్యక్తిని, నా స్నేహితుడిని కోల్పోయాను. నిన్ను ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటాను.’- రజనీకాంత్.
‘నా నిజమైన స్నేహితుడు దూరమయ్యాడు. ఈరోజు నన్ను నేను కోల్పోయాను’- మోహన్‌బాబు.
‘అంబరీశ్ ఇకలేరు. ఉదయాన్నే ఈ షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. గొప్ప మనసున్న వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’- అల్లు అర్జున్‌.

1a 2
‘ఎంతో గొప్ప వ్యక్తి. మిమ్మల్ని చాలా మిస్సవుతాం. సుమలత, కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గుండెపగిలిపోతోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’- రాధికా శరత్‌కుమార్‌.
‘అంబరీశ్‌ సర్‌ ఇంత త్వరగా వెళ్లిపోవడం నిజంగా బాధాకరం. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ సర్‌’- ఈషా రెబ్బా.
‘అంబరీశ్‌ మరణవార్త విని షాకయ్యాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది అబద్ధం అయితే బాగుండు అనిపిస్తోంది. నా గొప్ప స్నేహితుడు ఇంత త్వరగా వెళ్లిపోయి మమ్మల్ని శోకసంద్రంలోకి నెట్టేశారు.’- ఖుష్బూ.
‘ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. కానీ ఆయన్ని పలుమార్లు కలిసినందుకు సంతోషంగా ఉంది. మరో లెజెండ్‌ వెళ్లిపోయారు’- రాయ్‌ లక్ష్మి.
‘అంబరీశ్‌ సర్‌ ఇకలేరంటే నమ్మలేకపోతున్నాను. సుమలత గారికి, ఆమె కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి’- కల్యాణి ప్రియదర్శన్‌.‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu