HomeTelugu Trendingఈ ముగ్గురు మహిళలు నా ఉనికికి నిర్వచనం.. సూపర్‌ స్టార్

ఈ ముగ్గురు మహిళలు నా ఉనికికి నిర్వచనం.. సూపర్‌ స్టార్

8 8
ఉమెన్స్ డే సందర్భంగా.. సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. తమ జీవితంలోని ముఖ్యమైన మహిళల గురించి ప్రస్తావించారు. మహేశ్‌బాబు, నాగశౌర్య, అఖిల్‌ తదితరులు సోషల్‌మీడియా వేదికగా కుటుంబ సభ్యుల ఫొటోలు షేర్‌ చేశారు. మహేశ్‌ తన సతీమణి నమ్రత, తల్లి ఇందిరాదేవి, కుమార్తె సితార ఫొటోలను షేర్‌ చేశారు. ‘ఈ ముగ్గురు మహిళలు నా ఉనికికి నిర్వచనం. వారికి, అందరు మహిళలకు మరింత బలం చేకూరాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని మహేశ్‌ పోస్ట్‌ చేశారు.

‘నా ప్రియమైన సన్‌షైన్‌ అమలకు, మిగిలిన లవ్లీ మహిళలకు శుభాకాంక్షలు. మీరులేనిదే ఈ ప్రపంచానికి వెలుగు లేదు’ అంటూ అఖిల్‌ తన తల్లితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.

నాగశౌర్య తన తల్లి ఉషతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ‘మహిళ అందరి మంచి కోరుకుంటుంది. శక్తిమంతమైంది, తెలివైంది, సృజనాత్మకత ఎక్కువ. పురుషుడి కంటే ఎక్కువ బాధ్యతగా వ్యవహరిస్తుంది. ధన్యవాదాలు అమ్మా. నాకు ఈ జన్మ ఇచ్చినందుకు, నా జీవితానికి అర్థం తెలిపినందుకు థాంక్యూ. మిగిలిన అందరు మహిళలకు హ్యాపీ ఉమెన్స్‌డే’ అని ఆయన పేర్కొన్నారు.

8a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!