సెన్సార్ డేట్స్ వచ్చేశాయి!

సంక్రాంతి బరిలో నిలవడానికి రెండు పెద్ద సినిమాలు రెడీ అయిపోయాయి. చాలా కాలం తరువాత చిరంజీవి, బాలకృష్ణలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండడంతో ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో కూడా సినిమాల పట్ల ఆసక్తి నెలకొంది. జనవరి 1 నుండి రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు
జోరుగా జరగనున్నాయి. ముందుగా సినిమాల సెన్సార్ డేట్స్ ను ఫిక్స్ చేశారు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఈ నెల 29న జరగనున్నారు.

అదే రోజున శాతకర్ణి సెన్సార్ కూడా జరగాల్సివుంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఓ కొలిక్కి రాకపోవడంతో సెన్సార్ ఆలస్యం అవుతోంది. జనవరి 5న గౌతమీపుత్ర శాతకర్ణి సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్లనుంది. ఇప్పటికే ఆడియో ఫంక్షన్ జరుపుకొన్న శాతకర్ణి సినిమాకు ప్రీరిలీజ్ ఫంక్షన్ చేయాలా..? వద్దా..? అనే ఆలోచనలో ఉన్నారు. చిరు అయితే ఆడియో రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ చేసి ప్రీరిలీజ్ ఫంక్షన్ ను జనవరి 4న విజయవాడలో గ్రాండ్ గా చేయనున్నారు.