సమంత కోసం నిర్మాతగా మారనున్నాడు!

అక్కినేని నాగచైతన్య, సమంతల ప్రేమ విషయం అందరికీ తెలిసిందే. ఈ నెలాఖరున వీరిద్దరికీ నిశ్చితార్ధం కూడా జరగబోతోంది. అయితే ఇప్పుడు తనకు కాబోయే భార్య కోసం చైతు ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడట. గతేడాది కన్నడంలో విడుదలయిన ‘యూటర్న్’ సినిమాను తెలుగు, తమిళ బాషల్లో రీమేక్ చేయాలని దర్శకుడు పవన్ కుమార్ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా రీమేక్ లో నటించడానికి సమంత ఆసక్తి చూపిస్తుండడం విశేషం.

ఇప్పటికే పవన్, ఈ విషయమై సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరించాలని చైతు భావిస్తున్నాడు. తెలుగు, తమిళ బాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ విషయమై సామ్, చైతులు దర్శకుడు పవన్ కుమార్ ను కలవడానికి బెంగుళూరు వెళ్ళినట్లు సమాచారం. అదన్న మాట మేటర్.. మొత్తానికి తన ప్రియురాలి కోసం నిర్మాతగా కూడా మారిపోయాడు మన యంగ్ హీరో. భవిష్యత్తులో వీరిద్దరు కలిసి మరెన్ని సినిమాలు చేస్తారో.. చూడాలి!