Homeతెలుగు Newsమూర్తి మృతితో ఖాళీ అయిన స్థానం ..ఉప ఎన్నికకు అవకాశం..?

మూర్తి మృతితో ఖాళీ అయిన స్థానం ..ఉప ఎన్నికకు అవకాశం..?

ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తి రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందడంతో మండలిలో విశాఖ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఒక స్థానం ఖాళీ కానుంది. దీనికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నాయి. మూర్తి 2015 జూన్‌లో స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పట్లో జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థుల ఎంపికపై జిల్లా నేతలతో చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనూహ్యంగా చివరి నిమిషంలో మూర్తి పేరు ఖరారు చేశారు. అప్పట్లో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 2015 జులైలో శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేశారు.

9 2

మూర్తి మండలి సభ్యత్వ కాల పరిమితి నాలుగేళ్లు. వచ్చే సంవత్సరం జులైతో కాలపరిమితి ముగియబోతోంది. అంటే ఇంకా దాదాపు 10 నెలల సమయం ఉంది. సాధారణంగా శాసనసభ స్థానానికి గడువుకు ఏడాదిలోపు ఖాళీ అయితే ఉప ఎన్నిక నిర్వహించరు. శాసనమండలి స్థానం కావడం, ఎమ్మెల్సీని ఎన్నుకునే స్థానిక సంస్థల సభ్యుల కాలపరిమితి వచ్చే జులై వరకు ఉన్నందున ఉప ఎన్నిక రావొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబరు 23న మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందారు. సార్వత్రిక ఎన్నికలకు 9 నెలలు మాత్రమే గడువు ఉన్నందున ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. జిల్లాలో కేవలం పది రోజుల వ్యవధిలో ఒక శాసనసభ, ఒక శాసనమండలి స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu