ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై చంద్రబాబు స్పందన


ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రజల నాడి తెలుసుకోవడంలో ఎగ్జిట్‌ పోల్స్‌ విఫలమయ్యాయని చంద్రబాబు అన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఉన్నాయని, గతంలోనూ తప్పులు ఇచ్చాయని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంలో ఎలాంటి అనుమానమూ లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు ఎక్కువ సీట్లు సాధిస్తాయనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలనే డిమాండ్‌ నుంచి తాము వెనక్కి తగ్గేదిలేదని స్పష్టంచేశారు. వీవీప్యాట్లు, ఈవీఎం ఓట్లలో తేడా ఉంటే అన్ని వీవీప్యాట్లు లెక్కించాల్సిందేనని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.