రాఘవ లారెన్స్ రుద్రుడు ఫస్ట్‌ లుక్ అదుర్స్

రాఘవ లారెన్స్ హీరోగా మరో చిత్రం తెరకెక్కుతోంది. కతిరేశన్ దర్శకత్వంలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లారెన్స్ సరసన ప్రియభవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రుద్రుడు పేరు ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. యాక్షన్, హర్రర్, థ్రిల్లర్ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాఘవ లారెన్స్ ఈ చిత్రం కూడా అదే తరహాలో ఉండబోతుంది.

రుద్రుడు ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘దెయ్యాలు పుట్టినవి కావు .. సృష్టించబడినవి’ అనే ట్యాగ్ లైన్‌తో సినిమాలో రాఘవ పాత్ర ఏమిటో తెలిపేలా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 90 శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను క్రిస్మస్‌కు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో శరత్‌కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Image

CLICK HERE!! For the aha Latest Updates