వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు.. చై-సామ్

తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ లో ఓ జంట అక్కినేని నాగార్జున.. అమల అని చెప్తారు. ఇప్పుడు ఇదే ఫ్యామిలీలో మరో జంట వచ్చి చేరింది. వారే నాగ చైతన్య.. సమంత. నాగ చైతన్య సమంతలు. ఈ జంట ఏం మాయ చేశావే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఆటో నగర్ సూర్య సినిమాతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ, ఎప్పుడు ఈ జంట తమ ప్రేమ గురించి బయటకు చెప్పలేదు. ఎంగేజ్మెంట్‌కు కొద్ది రోజుల ముందు వరకు ఇద్దరి మధ్య ప్రేమ ఉందని బయటకు తెలియదు.

గత సంవత్సరం అక్టోబర్ 6 వ తేదీన ఇద్దరు ఇరు కుటుంబాల సాక్షిగా ఒక్కటయ్యారు. నేటికీ వీరి వివాహం జరిగి సంవత్సరం పూరైంది. ఇద్దరు సినిమాల్లో బిజీగా ఉన్నారు. తమ మొదటి వెడ్డింగ్ డే రోజున ఈ శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు ప్రారంభమైంది. భార్య భర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట. పెళ్ళైన తరువాత కూడా సమంత వరస హిట్స్ తో దూసుకుపోతున్నది. మరోవైపు నాగ చైతన్య కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.