గోదావరిలో చరణ్ హంగామా!

ఇప్పటివరకు మాస్ చిత్రాల్లో నటించిన రామ్ చరణ్ ‘దృవ’ సినిమాతో తన పంధాను మార్చుకున్నాడు. ఒక్కో సినిమాకు వైవిధ్యతను చూపించడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే సుకుమార్ సినిమా అంగీకరించాడు. సుకుమార్ తరువాత మణిరత్నంతో మరో సినిమా ప్లాన్ చేశాడు. అయితే ప్రస్తుతం సుకుమార్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి చరణ్ సిద్ధంగా ఉన్నాడు. పల్లెటూరి నేపధ్యంలో సాగే ఈ కథను ముందుగా కేరళలో చిత్రీకరించాలనుకున్నారు. కానీ ఈ విషయం సుకుమార్ మనసు మార్చుకొని మొదటి షెడ్యూల్ ను గోదావరి జిల్లాలో జరపబోతున్నాడు.
ఇప్పటికే పలు గ్రామాల్లో ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. దాదాపుగా 35 రోజుల పాటు అక్కడే కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారని సమాచారం. ఏప్రిల్ 1నుండి చరణ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా చరణ్ వినికిడి లోపం గల అబ్బాయిగా కనిపించబోతున్నాడని టాక్. కేవలం కళ్ళతోనే ప్రేమించుకునే మంచి ప్రేమ కథ అని వినికిడి. చరణ్ కూడా సినిమా కోసం లుక్ ను ట్రై చేస్తున్నాడు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.