సుకుమార్ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్..?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న పల్లెటూరి కుర్రాడిగా కనిపించనున్నాడనే వార్తలు చాలా రోజుల క్రితమే బయటకు వచ్చాయి.

తాజాగా ఈ సినిమాకు సంబందించి మరొక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది ఆ వార్తల సారాంశం. సినిమాలో ఒక పాత్ర పల్లెటూరి కుర్రాడిది కాగా, మరొకటి స్టైలిష్ రోల్ అని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో స్పష్టత రావాల్సివుంది. చరణ్ గతంలో కూడా డ్యూయల్ రోల్స్ చేశాడు. కాబట్టి తనకు ఈ సినిమాలో నటించడం పెద్ద కష్టమేమీ కాదు.