‘ఘంటసాల’ టీజర్ విడుదల

ప్రముఖ గాయకుడు ఘంటసాల జీవిత చరిత్ర ఆధారంగా “ఘంటసాల” బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. సి.హెచ్.రామారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యువ గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో నటించారు. ఎన్నో మధురమైన గీతాల ఆలపించి తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన అమర గాయకుడు శ్రీ ఘంటసాల. దేశం గర్వించదగిన గాయకుల్లో ఘంటసాల ఒకరు. తాజాగా ఈమూవీ టీజర్‌ను ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం విడుదల చేశారు. ఘంటసాల టీజర్‌ రెండు నిమిషాల 45 సెకన్ల పాటు ఉంది. ఈ టీజర్‌లో సగం భాగం రీసెంట్ బయోపిక్ మూవీలను ప్రస్తావించారు. మిగిలిన సగభాగం గాయకుడిగా చిన్నతనంలో “ఘంటసాల” ఎదుర్కొన్న ఇబ్బందులను గాయకుడిగా ఎదిగిన తీరుని చూపించారు.