రూటు మార్చిన చరణ్..!

వరుసగా మాస్ సినిమాల్లో నటించి రచ్చ, నాయక్, ఎవడు వంటి చిత్రాలతో కమర్షియల్ మాస్ హీరో అనిపించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎంతో నమ్మకంతో చేసిన బ్రూస్ లీ సినిమా రిజల్ట్ తో చరణ్ బాగా అప్సెట్ అయ్యాడు. అందుకే ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు రీమేక్ సినిమాను ఎన్నుకొని ‘ధృవ’ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇకపై కూడా అలానే సినిమాలు చేయాలని తన కమర్షియల్ రూట్ మార్చేశాడు ఈ మెగా హీరో. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటిస్తోన్న సినిమాలో ఓ పల్లెటూరి కుర్రాడిగా కనిపించబోతున్నాడు.
 
మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో చరణ్ చెవిటి వాడిగా కనిపించబోతున్నట్లు టాక్. చూపులతోనే ప్రేమించుకునే ఓ డిఫరెంట్ ప్యూర్ లవ్ స్టోరీను సుకుమార్ తెరకెక్కించబోతునట్లు తెలుస్తోంది. దీని తరువాత చరణ్ మణిరత్నం సినిమాను లైన్ లో పెట్టాడు. ఆ సినిమాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవనే చెప్పాలి. దీంతో మెగాభిమానులు కమర్షియల్ సినిమాలు చేస్తూ మధ్యలో ప్రయోగాలు చేయొచ్చు కానీ వరుసగా ఆఫ్ ట్రాక్ లో సినిమాలో చేస్తే చరణ్ మాస్ ఇమేజ్ ను కోల్పోతాడేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. చూడాలి!
 
 
Attachments