పుల్వామా దాడిపై సినీ ప్రముఖుల ఆగ్రహం

కశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం భద్రతా బలగాలపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దారుణ ఘటనను సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టడానికి ఆ ఉగ్రమూకలకు మనసెలా వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరమరణం పొందిన జవాన్లకు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలుపుతున్నారు.

– ఉగ్రదాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిసి చాలా బాధేసింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను- మహేశ్‌బాబు
-జవాను కుటుంబీకులకు మనస్ఫూర్తిగా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రతి జవాను త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. చాలా చాలా బాధాకరమైన రోజు- అల్లు అర్జున్
– పుల్వామా దాడి గురించి చాలా బాధపడ్డాను. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను- కాజల్‌ అగర్వాల్‌
– దాడి జరిగిందన్న వార్త విని షాకయ్యాను. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలు ధైర్యంగా ఉండాలి- రానా దగ్గుబాటి
– ఉగ్రవాదులు ఇంత దారుణ ఘటనకు ఒడిగడతారని అనుకోలేదు. జవాను కుటుంబీకులకు నా సంతాపం తెలియజేస్తున్నాను- గోపీచంద్
– దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన జవానులారా.. ఈ దేశం మీకు, మీ కుటుంబాలకు ఎంతో రుణపడి ఉంది- అల్లరి నరేశ్‌
– ఎంత దారుణం.. అమరవీరుల కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి- అనుష్క
– సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల పట్ల ఇంత దారుణం జరిగిందని తెలిసి ఎంతో బాధపడ్డాను. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను- సూర్య
-మన వీరులకు ఎక్కడా రక్షణ లేదు. పుల్వామా దాడి చాలా బాధాకరం. ఇందుకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాను- మంచు మనోజ్‌
– ద్వేషం ఎప్పటికీ సమాధానం కాదు- ప్రియాంక చోప్రా
– దాడి చేసింది చాలక సిగ్గులేకుండా మేమే చేశామంటూ జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ చెప్పుకుంటోంది. ఈ రాక్షసులకు మానవత్వమనేదే ఉండదు. పాకిస్థాన్‌లో ఇలాంటి ఉగ్ర సంస్థలకు రక్షణ ఎలా కల్పిస్తున్నారు?- స్వరా భాస్కర్‌
– రాక్షసులు మళ్లీ చెలరేగిపోయారు. ఏమాత్రం సహించకూడదు- రితేశ్‌ దేశ్‌ముఖ్‌
– మన కుటుంబాలను కాపాడటానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన జవాన్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది- సల్మాన్‌ ఖాన్‌
– ఉగ్రదాడి గురించి తెలిసి గుండె పగిలిపోయింది. మాటలు రావడంలేదు. మన జవాన్లు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను- సిద్ధార్థ్‌ మల్హోత్ర
– మనుషులు ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారు? అసలు ప్రపంచం ఎటుపోతోంది? పుల్వామా దాడి షాక్‌కు గురిచేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దాడిలో గాయపడిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను- కృతి సనన్‌
– దాడిలో మన జవాన్లు వీరమరణం పొందారని తెలిసి చాలా బాధపడ్డాను- అర్జున్‌ కపూర్‌
– ఎందరో జవాన్ల ప్రాణాలు తీసి, వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిన వారిని క్షమించకూడదు. ఈ నష్టాన్ని తట్టుకునే శక్తి వారి కుటుంబాలకు ప్రసాదించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. వారి కోసం ప్రతీ భారతీయుడు ప్రార్థిస్తుంటాడు. జై హింద్‌- సోనూ సూద్
-ఎంత దారుణం.. ప్రేమికుల రోజు జరుపుకొంటున్న వేళ ద్వేషం తలెత్తింది. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి- అభిషేక్‌ బచ్చన్‌‌