నందమూరి, మెగా హీరోల మల్టీస్టార్ కు ముహూర్తం!

గత కొన్ని రోజులుగా కల్యాణ్ రామ్, సాయి ధరం తేజ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ సినిమాను
రూపొందించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దానికి తగ్గ కథను
సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది. త్వరలోనే
ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ సినిమా కోసం ‘రామకృష్ణ’ అనే టైటిల్
ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈ టైటిల్ నే ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కు జంటగా త్రిషను, సాయి ధరం తేజ్ సరసన రెజీనాను ఎంపిక
చేయనున్నారు. ఈ సినిమా గనుక పట్టాలెక్కితే అటు నందమూరి అభిమానుల్లో, ఇటు
మెగాభిమానుల్లో సినిమాపై క్రేజ్ పెరగడం ఖాయం. ఆటోమేటిక్ గా ఈ సినిమా విపరీతమైన
హైప్ క్రియేట్ అవుతుంది.

CLICK HERE!! For the aha Latest Updates