HomeTelugu Trendingచిన్నారి పెళ్లి కూతురు బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్..

చిన్నారి పెళ్లి కూతురు బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్..

Chinnari pellikuthuru fame
హిందీ సీనియర్ నటి, చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లో బామ్మగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి సురేఖా సిక్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం ఈమె వయసు 75 సంవత్సరాలు. నిన్న మంగ‌ళ‌వారం అనారోగ్యం పాలైన ఆమెకు రాత్రి సమయంలో బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో వెంటనే ముంబై లోని క్రిటికేర్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్‌ రావడం ఇది రెండోసారి అని కుటుంబ సభ్యులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది సురేఖా సిక్రి. చివరగా ఆమె నెట్‌ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్‌’లో జాన్వీ కపూర్‌తో కలిసి నటించింది. ‘తమస్’ (1988), ‘మమ్మో’ (1995), ‘బధాయి హో’ (2018) సినిమాల్లో తన నటనకు గాను జాతీయ ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!