‘నారప్ప’ పెద్దకొడుకుగా కార్తిక్‌.. ఫస్ట్‌లుక్‌

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో నారప్ప భార్య సుందరమ్మగా ప్రియమణి న‌టిస్తోంది. కాగా నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌‌న్నా గా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తిక్ ర‌త్నం న‌టిస్తున్నారు. ఈ రోజు కార్తిక్ పుట్టిన‌రోజు సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. మునిక‌న్నా లుక్‌ని విడుద‌ల చేసింది నార‌ప్ప చిత్ర బృందం. విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates