HomeTelugu Trendingసుకుమార్ డైరెక్షన్‌లో చిరంజీవి యాడ్.. వైరల్‌

సుకుమార్ డైరెక్షన్‌లో చిరంజీవి యాడ్.. వైరల్‌

Chiranjeevi ad directed by

సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్ చేస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నా విషయం తెలిసిందే. శుభగృహ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్ గా మెగాస్టార్‌ చిరంజీవి ఈ యాడ్ చేస్తున్నట్టు వారే స్వయంగా వెల్లడించారు కూడా. అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం కానుంది. తాజాగా బయటకు వచ్చిన ఈ యాడ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యాడ్ లో మెగాస్టార్ తో పాటు ఖుష్బూ, అనసూయ భరద్వాజ్ కన్పించగా, ఒక మంచి ట్విస్ట్ తో హ్యాపీ న్యూస్ ను రెవీల్ చేశారు. ఉగాది పర్వదినాన విడుదలైన ఈ యాడ్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

కాగా ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప-2’ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్, రామ్ చరణ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మాత్రమే కాకుండా మెగాస్టార్ ఖాతాలో భోళా శంకర్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!