దేవిశ్రీ రెమ్యూనరేషన్ పెంచేశాడు!

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర సంగీత దర్శకుల్లో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఏ.ఆర్.రెహ్మాన్ తెలుగు సినిమాలు చేయకపోవడం.. హ్యారీస్ జయరాజ్ చరిష్మా తగ్గడంతో ప్రస్తుతం దేవిశ్రీ హవా పెరిగిపోతోంది. ఇప్పటివరకు 2.5 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకున్న దేవిశ్రీ
ఇప్పుడు మళ్ళీ తన రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. తనకున్న డిమాండ్ ను బట్టి దాదాపు మూడు కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడట. ఈ మధ్య కాలంలో దేవి సక్సెస్ రేట్ బాగా పెరిగింది.

స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు మాత్రం సుకుమార్, దిల్ రాజుల సినిమాలకు పని చేస్తున్నాడు. దేవి మ్యూజిక్ అంటే మాస్ ఆసియన్స్, యూత్ వెంటనే కనెక్ట్ అయిపోతారు. కానీ ఆయన రెమ్యూనరేషన్ పెంచేయడంతో దర్శకనిర్మాతలు దేవిని సంప్రదించడానికి సైతం భయపడుతున్నారు. ఈ ప్రభావం వలన దేవికు సినిమాల ఛాన్స్ లు ఏమైనా తగ్గుతాయేమో చూడాలి!