పవన్ పేరు చెప్పి కోత పెట్టారు!

పవన్-త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో సినిమా రూపొందనుంది. అందులో చాలా భాగం పవన్, త్రివిక్రమ్ ల రెమ్యూనరేషన్ కు పోతుంది. ఈ నేపధ్యంలో సినిమా ఖర్చు తగ్గించుకోవాలంటే హీరోయిన్ల విషయంలో కోత పెట్టాలి. ఆ విషయంలో దర్శకనిర్మాతలు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. పవన్ సినిమాలో ఛాన్స్ ఒక్కసారి క్లిక్ అయితే ఇక తిరుగుండదని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు.

కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూయల్ వంటి అప్ కమింగ్ హీరోయిన్స్ కు పవన్ సినిమాలో ఛాన్స్ రావడమే ఎక్కువ. పైగా త్రివిక్రమ్-పవన్ అంటే హిట్ కాంబినేషన్. దీంతో కీర్తి సురేష్ పారితోషికం ఏ మాత్రం పెంచకుండా తన డేట్స్ అడ్జస్ట్ చేసిందట. ఇక అనుకి ఎంత ఇస్తున్నారో.. తెలియకుండానే ప్రాజెక్ట్ మీద సైన్ చేసిందట. అయితే పవన్ సరసన నటించి స్టార్ స్టేటస్ పొందిన హీరోయిన్లు చాలా తక్కువ. మరి కీర్తి, అను లకు స్టార్ స్టేటస్ హోదా లభిస్తుందేమో చూడాలి!