నిత్య శ్రామికులందరికీ మేడే శుభాకాంక్షలు: చిరంజీవి


ఈ రోజు మేడే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి నిత్య శ్రామికులంద‌రికి త‌న సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ‘అందరికీ మేడే శుభాకాంక్షలు.. కష్టే ఫలి అనేది మన నానుడి. మనం పడే కష్టమే మనకి నిజమైన ప్రతిఫలాన్ని అందచేస్తుంది. నేను కూడా ఎప్పుడూ నమ్మే సిద్ధాంతం. శ్రమైక సౌందర్యాన్ని గుర్తుచేసే ఈ రోజున ప్రపంచంలోని నిత్య శ్రామికులందరికీ వందనాలు, అభివందనాలు’ అంటూ చిరు ఆచార్య సినిమాలోని ఎర్ర కండువా ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్‌ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates