HomeTelugu Big Storiesఅందుబాటు లోకి వచ్చిన చిరు ఆక్సిజన్ బ్యాంక్స్

అందుబాటు లోకి వచ్చిన చిరు ఆక్సిజన్ బ్యాంక్స్

Chiranjeevi sets oxygen ban

మెగాస్టార్‌ చిరంజీవి చెప్పినట్లుగానే ‘చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌’లను అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా బారినపడి సమయానికి ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం తెలుగు రాష్ట్రాలోని పలు జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఇటీవల తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం ఉదయం అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ‘చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌’ సేవలు ప్రారంభమయ్యాయి.

ఈ విషయం గురించి చిరు మాట్లాడుతూ.. ‘‘అనుకున్న ప్రకారం వారం రోజులలోపే వందలకొద్ది ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్లు సంపాదించాం. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో బుధవారం నుంచి ‘చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌’ సేవలు ప్రారంభమవుతున్నాయి. గురువారం నుంచి ఖమ్మం, కరీంనగర్‌లతోపాటు మరో ఐదు జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆక్సిజన్‌ అందక ఎవరూ ఇబ్బందిపడకూడదు. ఇన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు సంపాదించడానికి రామ్‌చరణ్‌ కూడా ఎంతో కృషి చేశాడు. నాకెంతో సంతోషంగా ఉంది’’ అని చిరంజీవి తెలియజేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లను తరలిస్తున్న వీడియోను చిరంజీవి ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu