చిరు ఆ గెటప్ లో సెట్ అవుతాడా..?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాతో వెండితెరపై ప్రయోగం చేయడానికి రెడీ అయిపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కథను, డైరెక్టర్ ను ఫైనల్ చేసుకున్నాడు. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ చిరు ఈ పాత్రకు సెట్ అవుతాడా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజజీవితంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎలా
ఉంటారనే విషయంపై తెలుగు ప్రేక్షకులకు అవగాహన ఉంది.

కండలు తిరిగిన దేహంతో.. ఆరడుగుల ఎత్తుతో.. పెద్ద మీసాలు, తలపై పాగా పెట్టుకొని భారీ ఖాయంతో కనిపిస్తాడు. మరి చిరు ఈ లుక్ ను క్యారీ చేయగలడా..? మీసం, తలపాగా వరకు ఓకే గానీ కండలు తిరిగిన దేహం అంటే ఈ వయసులో చిరు భారీ కండలతో కనిపించాలంటే కష్టం. మరి కథకు ఫిక్షన్ జోడించినట్లు.. లుక్ ను కూడా మార్చేస్తారేమో.. చూడాలి!