ప్రభాస్‌ తో ‘కేజీఎఫ్‌’ హీరో.. ఫొటోస్‌ వైరల్‌

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ .. బాహుబలి 2 సినిమా విడుదల తరువాత పబ్లిక్‌ ఈవెంట్స్‌లో చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఎక్కువగా విదేశాల్లో చక్కర్లు కొడుతున్నాడు ఈ బహుబలి. అయితే తాజాగా మరో హీరోతో కలిసి ప్రభాస్‌ ముంబైలో సందడి చేశాడు. త్వరలో కేజీఎఫ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు కన్నడ హీరో యష్‌.

ఐదు భాషల్లో విడుదల కాన్నున ఈ సినిమా హిందీ వర్షన్ ప్రమోషన్ల కోసం ముంబైలో బిజీగా ఉన్నాడు యష్. అదే సమయంలో ముంబైలో ఉన్న ప్రభాస్‌ను డిన్నర్‌కు ఆహ్వానించాడు. యష్‌ కోరిక మేరకు డిన్నర్‌ పార్టీకి హజరైన ప్రభాస్‌.. యష్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates