HomeTelugu Trendingఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సంచనల నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సంచనల నిర్ణయం

7 5
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పండుగల సమయంలో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులతో భవిష్యత్తులో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రకటించారు. శనివారం సాయంత్రంలోగా విధుల్లో చేరకుంటే వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఆర్టీసీలో 1200 మంది లోపు ఉద్యోగులు మాత్రమే ఉన్నారని.. వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించవలసి ఉంటుందని అన్నారు.

ఆర్టీసీ ఇబ్బందుల్లో వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారి చేసింది తీవ్రమైన తప్పిదమని ముఖ్యమంత్రి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలు కూడా జరిపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.రిం

భవిష్యత్ లో ఆర్టీసీకి సంబంధించి, ఎప్పటికీ క్రమ శిక్షణా రాహిత్యం, బ్లాక్ మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా వుండకూడదని ప్రభుత్వం భావిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. గడువు పూర్తయ్యేలోపల, అంటే ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అని సీఎం అన్నారు. తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

4,114 ప్రయివేట్ బస్సులు ఉన్నాయని వాటికి స్టేజ్ క్యారేజ్ గా చేస్తే వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వస్తారని, ఈ విషయంలో వాళ్ళతో ఆర్టీసీ, రవాణా అధికారులు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని, కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ వుంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

ఏఏ కేటగిరీకి చెందిన సిబ్బంది సమ్మెకు పోయారో ఆయా కేటగిరీలకు చెందిన సిబ్బందిని భర్తీ చేయడానికి నియామకం వుంటుందని అన్నారు. ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివనీ ఆయన పేర్కొన్నారు. ఈ పద్ధతిలో చర్యలు చేపడితే బస్సులు బాగా నడుస్తాయని, రెండుమూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుందని సీఎం తెలిపారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని ముఖ్యమంత్రి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu