HomeTelugu Big Storiesపెళ్ళి తరువాత బోల్డ్‌గా మారిపోయిన కలర్స్‌ స్వాతి..!

పెళ్ళి తరువాత బోల్డ్‌గా మారిపోయిన కలర్స్‌ స్వాతి..!

8టాలీవుడ్‌లో కలర్స్‌ స్వాతి పరిచయం అక్కరలేని నటి.. పెళ్లయ్యాక భర్తతో ఇండోనేషియాలో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. భర్త వికాస్ తో కలిసి అక్కడ కాపురం పెట్టిన ఈ బ్యూటీ, తాజాగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాత మరింత బోల్డ్ గా తయారైంది ఈ బ్యూటీ. గతంలో తనపై వచ్చిన ఓ సెక్స్ వీడియో టేపు ఉదంతంతో పాటు రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. “నేను కలర్స్ చేస్తున్నప్పుడు ఓ mms వచ్చింది. అందులో సెక్స్ చేస్తున్న అమ్మాయికి కూడా పన్నుపై పన్ను ఉంది. దీంతో అందులో ఉన్నది నేనే అనుకున్నారంతా. సెట్స్ లో ఒకటే గుసగుసలు. ఆ టైమ్ లో చాలా బాధేసింది. ఇప్పటికీ నా క్యారెక్టర్ను తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేను.”

అందరూ రకరకాల ప్లేసుల్లో టాటూలు వేయించుకుంటారు. కానీ స్వాతి మాత్రం మిడిల్ ఫింగర్ పై టాటూ వేయించుకుంది. ఎవరైనా తప్పుగా మాట్లాడితే టాటూ చూపిస్తానంటోంది. మరో పచ్చబొట్టు వేయించుకుంటే మాత్రం చాలా సీక్రెట్ ప్లేస్ లో వేయించుకుంటానంటోంది. నా మిడిల్ ఫింగర్ పై టాటూ ఉంది. ఎవరికైనా చూపించినప్పుడు బూతుగా ఉంటుంది కానీ బాగుంటుంది. టైమ్ గురించి చెప్పే టాటూ ఇది. గతం గురించి ఆలోచించొద్దు, ప్రస్తుతం ఉన్న మూమెంట్ ను ఎంజాయ్ చేయండి అని చెప్పడానికే ఈ టాటు అంటోంది. ఎవరైనా పనికిమాలిన ప్రశ్నలు అడిగితే, నా టాటూ చూశారా అని (మిడిల్ ఫింగర్) చూపిస్తుంటాను. మరో టాటూ వేయించుకోవాల్సి వస్తే మా ఆయనకు మాత్రమే కనిపించి, వేరే ఎవరికీ కనిపించని పార్ట్ లో పెట్టించుకుంటాను అంది. ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉన్న స్వాతి, కచ్చితంగా రీఎంట్రీ ఇస్తానంటోంది. ఓ మంచి సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని ఉందంటూ.. ఈ లోగా ఫ్యామిలీ లైఫ్ ను కొన్నాళ్లు ఎంజాయ్ చేస్తానని తన మనసులో మాటను బయటపెట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!