జనవరిలో స్టార్‌ కమెడియన్‌ పెళ్లి..!

అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న కమెడియన్‌ రాహుల్ రామకృష్ణ. డిఫరెంట్ డైలాగ్‌ డెలివరీ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ యువ నటుడు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని కూడా తనదైన స్టైల్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు రాహుల్.

తన సోషల్ మీడియా పేజ్‌లో బీచ్‌లో తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన రాహుల్‌ ‘జనవరి 15న నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరికీ చెప్పకండి’ అంటూ కామెంట్‌ చేశాడు. రాహుల్‌ కు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి.