
బుల్లితెర హాస్యనటుడు యాదమ్మ రాజు పెళ్లి ఘనంగా జరిగింది. ‘పటాస్’ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాదమ్మ రాజు.. ఆ తర్వాత పలు కామెడీ షోలు చేస్తూ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు.
యాదమ్మ రాజు, స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఆదివారం జరిగింది. ఈ వివాహ వేడుకలో బిగ్‌బాస్ సెలబ్రెటీలు సందడి చేశారు. ఇక టాలీవుడ్‌లో పలువురు సెలబ్రెటీలు కూడా వీరి పెళ్లికి హాజరయ్యారు. నాగబాబు, ఆకాష్ పూరీ, అశ్విన్ బాబు, యాంకర్ ప్రదీప్ వంటి పలువురు వివాహా వేడకకు హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













