ఘనంగా ‘మజిలీ’ ప్రీ రిలీజ్‌ వేడుక.. ఆసక్తికరంగా న్యూ ట్రైలర్‌

‘మజిలీ’ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఫిల్మ్‌ నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌ దీనికి వేదికైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్‌ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నాగార్జున, వెంకటేశ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.

నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. షైన్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటించారు. గోపీ సుందర్‌ బాణీలు అందించారు. ఏప్రిల్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.