వారిద్దరిలో విజయ్ వోటెవరికి..?

కాజల్, సమంత ఇద్దరు దక్షిణాది స్టార్ హీరోయిన్లే… ఇద్దరికీ భారీ మొత్తాన్నే పారితోషికంగా ముట్టజెప్పుతున్నారు. అయితే ఇప్పుడు ఓ సినిమా విషయంలో వీరి మధ్య పోటీ నెలకొంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న 61వ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో
హీరోయిన్ గా కాజల్ ను తీసుకోవాలో.. లేక సమంతను తీసుకోవాలో.. అనే విషయంలో చిత్రబృందం సతమతమవుతుంది.

గతంలో కాజల్, విజయ్ నటించిన ‘తుపాకి’,’జిల్లా’ సినిమాల్లో నటించింది. అలానే సమంత కూడా విజయ్ తో కలిసి ‘తేరి’ అనే సినిమాలో నటించింది. ఈ నేపధ్యంలో వీరిద్దరిలో ఒకరిని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మరి ఫైనల్ గా ఈ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి!