
Samantha Saree Price:
సమంత ఎక్కడకి వెళ్ళినా ఫ్యాన్స్ చూపులు అక్కడే పడతాయి. అందం, అభినయం, ఫ్యాషన్ – ఏది తీసుకున్నా సమంత తనదైన స్టైల్‌లో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ దుబాయ్‌లో జరిగిన జ్యూవెలరీ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొంది. అక్కడ ఆమె వేసుకున్న గోల్డెన్ శారీలో ఎవరి దృష్టినైనా కట్టిపడేసింది.
ఈ శారీ ప్రత్యేకత ఏంటంటే – డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేసిన ఈ శారీ ధర ఏకంగా రూ. 3.95 లక్షలు. అదిరిపోయే స్టైల్‌తో, స్వాగ్‌తో సమంత ధరించిన ఈ శారీకి సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా మందికి ఈ ధర ఎక్కువగా అనిపించొచ్చు కానీ సమంత లాగా ఎవరు క్యారీ చేస్తారు చెప్పండి?
వర్క్‌ఫ్రంట్‌లో చూస్తే – సమంత ఇటీవలే తన స్వంత బ్యానర్ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’తో నిర్మాతగా మారింది. ‘శుభం’ అనే సినిమా ద్వారా ఈ ప్రొడక్షన్ మొదలైంది. గతంలో ఆమె ‘శాకుంతలం’, ‘ఖుషి’ సినిమాల్లో నటించింది. అలాగే వరుణ్ ధవన్‌తో కలిసి ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
ఇప్పుడు సమంత చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ‘రక్త బ్రహ్మాండ: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌తో పాటు, తన స్వంత బ్యానర్ నుంచి ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు.