HomeTelugu Big Storiesభారత్‌లో కరోనా వ్యాప్తిపై ఐఎంఏ ప్రకటన

భారత్‌లో కరోనా వ్యాప్తిపై ఐఎంఏ ప్రకటన

7 2
కరోనా వైరస్‌ పై అవగాహన కల్పిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంగళవారం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఏపీలోని తిరుపతిలో వ్యాధి నిర్ధారణ కేంద్రం ఉందని, కరోనా వైరస్ ఇప్పటివరకు వచ్చిన వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి కాదని తెలిపారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందన్నారు. కరోనా వ్యాధి కేవలం రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు మాత్రమే దాడి చేస్తుందని విదేశాల నుంచి వచ్చిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కరోనా వైరస్‌తో లక్ష మంది ప్రజలు బాధ పడుతున్నారని, ఇందులో 25 శాతం మంది చనిపోవడం జరిగిందన్నారు. ఇది అంటువ్యాధిగా నిర్ధారణ చేయటంతో ఐఎంఏ తరపున అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దగ్గినా, తుమ్మినా చేతులు అడ్డుపెట్టుకోవటం.. మాస్కులు ధరించటంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణ జలుబు దగ్గు వల్ల ఇబ్బంది ఉండదని, ఒక వారం పదిరోజులు దగ్గు జలుబుతో బాధ పడుతున్న వారు బయట జన సమూహాల్లోకి వెళ్లకుండా ఉంటే మంచిదని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu