HomeTelugu Trendingకరోనాతో గాయకుడు మృతి..

కరోనాతో గాయకుడు మృతి..

3 6

కరోనా వైరస్ ఎవర్ని వదలడం లేదు.. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరిపై దీని ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే అనేకమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. కరోనా వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాగాయకుడు, ఆర్టీసీ ఎప్లాయీస్‌ యూనియన్‌ నేత సుద్దాల నిస్సార్‌ కరోనా వైరస్‌తో బుధవారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈయూ నేతగా, రచయితగా, ప్రజానాట్యమండలి కార్యదర్శిగా నిస్సార్‌ సేవలందించారన్నారు. కరోనా సోకినా తర్వాత నిస్సార్‌ చికిత్స కోసం చాలా ప్రైవేటు ఆస్పత్రులు తిరిగారని, అయినప్పటికీ ఎక్కడా చేర్చుకోలేదని రాజిరెడ్డి వాపోయారు. చివరికి గాంధీలో చేరితే వెంటిలేటర్‌ సదుపాయం లేక తుదిశ్వాస విడిచారని ఆయన తెలిపారు. ‘కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన. కరోనా కరోనా నిన్ను మట్టికరిపిస్తాం 130 కోట్ల జనం సరేనా!!’అంటూ కరోనాపై కలం గురిపెట్టిన నిస్సార్‌ అకాల మరణంపై పలువురు సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

………….

Recent Articles English

Gallery

Recent Articles Telugu