‘వకీల్‌ సాబ్‌’పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటించిన తాజా చిత్రం వ‌కీల్ సాబ్. ఏప్రిల్ 9న థియేట‌ర్స్ లో విడుద‌ల కాగా, తొలి వారం ఈ చిత్రానికి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కులు రావ‌డం త‌గ్గించేశారు. దీంతో ఏప్రిల్ 30న చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అయితే ఈ సినిమాపై అభ్యంత‌రం తెలుపుతూ ఓ వ్య‌క్తి పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వ‌కీల్ సాబ్ చిత్రంలో నా అనుమ‌తి లేకుండానే ఓ స‌న్నివేశంలో నా ఫోన్ నెంబ‌ర్‌ను స్ర్కీన్‌పై చూపించార‌ని సుధాక‌ర్ అనే వ్య‌క్తి పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా సినిమాలో నా ఫోన్ నెంబ‌ర్ చూపించ‌డం వ‌ల‌న నాకు కంటిన్యుయ‌స్‌గా కాల్స్ వ‌స్తున్నాయి. కొంద‌రు నోటికొచ్చిన‌ట్టు తిడుతూ నన్ను మాన‌సిక ఆవేద‌న‌కు గురి చేస్తున్నారు అని సుధాక‌ర్ స్ప‌ష్టం చేశారు. ఇప్పటికే బాధితుడి తరపు లాయర్‌ వకీల్‌ సాబ్‌ నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంప‌గా, వారు దీనిపై స్పందించాల్సి ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates