పదవి నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె


బాలీవుడ్‌ నటి దీపికాపదుకొణె ఎంఏఎంఐ ఛైర్ పర్సన్ పదవి నుంచి తప్పుకున్నారు ఈ విషయాన్ని ఇన్‌స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు. దీపిక 2019లో ఎంఏఎంఐ ఛైర్ పర్సన్ బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో సమయం కేటాయించలేకపోతున్నట్లు తెలిపారు. ఒక నటిగా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది టాలెంట్‌ని గుర్తించి ముంబయికి తీసుకురావడం ఆనందాన్ని ఇచ్చిందన్న దీపిక ఈ సంస్థతో తనకున్న అనుబంధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని అన్నారు. మరో సమర్థవంతమైన వ్యక్తి ఈ సంస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates