ప్ర‌భాస్‌తో ఫొటో దిగింది.. త‌ర్వాత చెంపపై కొట్టింది.. వీడియో వైరల్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్ర‌భాస్‌ కి బాహుబలి సినిమాతో తన రేంజే మారిపోయింది. ఈసినిమా సక్సెస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్‌. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులు ప్రభాస్‌కు అభిమానులుగా మారిపోయారు. అందుకే ఇండియాలోనే కాదు.., ప్రభాస్‌ విదేశాలకు వెళ్లినా అభిమానులు ఆయన్ను వదిలిపెట్టడం లేదు.

ఇటీవల ప్రభాస్‌ సాహో సినిమా షూటింగ్ లో భాగంగా లాస్‌ ఏంజిల్స్ వెళ్లాడు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ప్రభాస్‌తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ ఇవ్వ‌గానే ప్ర‌భాస్ ను చూసి ఓ అమ్మాయి ఆనందం ప‌ట్ట‌లేక‌పోయింది. ఎలాగైనా ఫోటో దిగాల‌ని ఆరాట‌ప‌డింది. ప్ర‌భాస్ కూడా చాలా కూల్ గా ఆమెను పిలిచి భుజంపై చేయి వేసి ఫోటో దిగాడు. ఇక త‌ర్వాత ఆ అమ్మాయి ఆనందాన్ని ప‌ట్టుకోవ‌డం ఎవ‌రి వ‌ల్లా కాలేదు. సంతోషంలో గాల్లో గంతులేసింది. అక్క‌డితో ఆగ‌కుండా ఫోటో దిగిన త‌ర్వాత ప్ర‌భాస్ బుగ్గపై చిన్న‌గా కొట్టింది ఆ అమ్మాయి. ఇక ఆ త‌ర్వాత మ‌ళ్ళీ ఆనందంతో డాన్సులు చేసింది ఆ అమ్మాయి.

త‌ర్వాత కొంద‌రు అభిమానుల‌తో ప్ర‌భాస్ ఫోటోలు దిగాడు. ఇదంతా ప్ర‌భాస్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. చివ‌ర్లో ఓ లైన్ కూడా పెట్టాడు ప్ర‌భాస్. దూరంగా ఉండి న‌న్ను ప్రేమించండి అంటూ రాసుకొచ్చాడు ప్రభాస్‌. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. సాహో షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస‍్టు 15న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates