
సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రంలోరష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి సోమవారం అభిమానులకు ఓ ట్రీట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, శనివారం మహేష్-తమన్నాల ‘డాంగ్.. డాంగ్’ అంటూ సాగే పాట ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్. ‘సరిలేరు నీకెవ్వరు’ పాటలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంత మంచి పాటలు ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెలలో ప్రతి సోమవారం ఒక్కో పాటతో మీ ముందుకు వచ్చాం. వాటిని మీరు ఆదరించి, టిక్‌టాక్‌లలో వీడియోలు కూడా చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇక ఆల్బమ్‌లో చివరి పాట మంచి పార్టీ సాంగ్ ఈ సోమవారం విడుదల చేయబోతున్నాం. కొంతమంది సినీ స్టార్స్‌ను తీసుకెళ్లి, ఆర్మీతో ఇంట్రాక్ట్ చేయిస్తుంటారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని, ఈ సినిమాలో తమన్నా కూడా ఒక సినీ స్టార్‌గా వచ్చి ఆర్మీతో కలిసి సందడి చేస్తుంది. ఇది కేవలం సరదా పాట మాత్రమే. ఐటమ్ సాంగ్ కాదు. ఈ పాట కూడా మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్2’తో మంచి విజయాన్ని ఇచ్చారు. రాబోయే సంక్రాంతికి అంతే ఎంటర్‌టైన్‌మెంట్‌తో మహేష్‌బాబు సరికొత్త పాత్రతో అలరించబోతున్నారు’ అని అన్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేస్తుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. మహేష్ కూడా తన డబ్బింగ్‌నుపూర్తి చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
As my director rightly said it is NOT an item song. It's a party song! Here's #DaangDaang Promo!!! Enjoy!!! @ThisisDSP Amazing as usual 👌@AnilRavipudi @AnilSunkara1 @RathnaveluDop @ramjowrites@tamannaahspeakshttps://t.co/qpqdluN8VI
— Mahesh Babu (@urstrulyMahesh) December 28, 2019













