‘దసరా’ ఫస్ట్‌డే వసూళ్లు

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ఇంతవరకూ తాను కనిపించిన దానికి భిన్నంగా .. తనకి గల క్రేజ్ కి భిన్నంగా ఈ సినిమాలో నాని కనిపించాడు. గోదావ‌రి ఖ‌ని స‌మీపంలో వీర‌ప‌ల్లి అనే క‌ల్పిత గ్రామంలో న‌డిచే క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది. దీక్షిత్ శెట్టి కీలకమైన పాత్రను పోషించాడు.

సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైంది. తొలి ఆటతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా, నిన్న అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ‘దసరా’ సినిమాకు తొలిరోజున క‌లెక్ష‌న్స్ రావ‌టం హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క రోజులోనే 38 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. నానీ ఇంట్రడక్షన్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ ఫైట్ ఈ సినిమా హైలైట్స్ లో కనిపిస్తాయి. దగ్గర్లో పెద్ద సినిమాలేం లేకపోవడం ‘దసరా’కి మరింత కలిసొచ్చే అంశం. వీకెండ్ ముగిసే నాటికి ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందేమో చూడాలి. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ట్రైల‌ర్‌, పాట‌ల‌తో సినిమాపై మంచి అంచ‌నాలే క్రియేట్ అయ్యాయి.ఇప్పుడు సినిమా అంచ‌నాల‌కు ధీటుగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతుండ‌టంపై నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.

Image

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates