దసరాకు ప్రారంభం కానున్న “రజని ద డాన్”

 దసరాకు ప్రారంభం కానున్న “రజని ద డాన్” 
అభి సుబ్రహ్మణ్యం క్రియెషన్స్ బ్యానర్ లో శివపురం సురేంద్ర కుమార్ నిర్మాతగా “రజని ద డాన్” అనే చిత్రాన్ని ప్రకటించారు. దీనికి శ్రీకృష్ణ గొర్లె దర్శకుడు. “కిల్లింగ్ వీరప్పన్” చిత్రానికి సంగీతం అందించిన శాండి ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించనున్నారు.  సుబ్బు హీరోగా పరిచయం కానున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ “ఏ బంధం లేని హీరోకి అనుకోకుండా ఒక బంధం ఏర్పడటంతో అతని జీవితం ఎలా మలుపు తిరిగింది అనేది ఈ చిత్ర కథ. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులొ 5 పాటలు ఉంతాయి ముగ్గురు ప్రముఖ హీరో హీరోయిన్లు ఉంటారు. విలన్ గా ఒక ప్రముఖ హీరో నటించబోతున్నాడు. త్వరలో వారి పేర్లను ప్రకటిస్తాం. మా బ్యానర్లోనే సంవత్సరానికి రెందు సినిమాలు నిర్మిస్తాం. అక్టోబర్ 11 విజయదశమి రోజు నుండి “రజని ద డాన్” చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలై రెండు షెడ్యూల్స్ లలొ పూర్తి చేస్తాం. వైజాగ్, బెంగళూరు, కొడైకెనాల్, ఊటీ లలొ చిత్రీకరణ జరుపుతాం. మరిన్ని వివరాలు త్వరలొ ప్రకతిస్తాం” అని నిర్మాత తెలిపారు. అయితే “రజనీకాంత్” అనే షార్ట్ ఫిల్మ్ తీసిన ఈ టీం తోనే ఈ సినిమా నిర్మిస్తున్నామని నిర్మాత చెప్పడం గమనార్హం.
Rajani the Don Short Film Premier Show Pressmeet Photos
CLICK HERE!! For the aha Latest Updates