సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో రెండో సినిమా

‘బాహుబలి’ సినిమా తర్వాత సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రాలు వరుసగా పెరుగుతున్నాయి. ఇటీవలే శివకార్తికేయన్‌ నిర్మాణంలో ‘కనా’ లో కూడా ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. ప్రస్తుతం ‘తీర్పుగల్‌ విర్కపడుం’ చిత్రంలో ఆయన మళ్లీ ప్రధాన పాత్రలో మెరుస్తున్నారు. సత్యరాజ్‌ కుమార్తెగా స్మృతి వెంకట్‌ నటిస్తోంది. మయిల్‌స్వామి కుమారుడు హీరో. ధీరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ‘కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఓ తండ్రి పోరాడే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాం. సత్యరాజ్‌ పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తికాగా నెలాఖరులోగా మొత్తం పూర్తి చేస్తాం. హీరోయిన్‌ చుట్టూనే కథ నడుస్తుంది. ఇందులో సత్యరాజ్‌ వైద్య కళాశాల ప్రొఫసర్‌గా నటిస్తున్నారు. మహిళలకు ఇది చాలా కీలకమైన చిత్రం అని చెప్పగలను. నేటి సమాజంలోని దుర్మార్గులను ప్రశ్నించే చిత్రమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తా’మని పేర్కొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates