ఆ వివాదంతో నాకు సంబంధం లేదు!

ఎన్నడూ లేని విధంగా ఈసారి నంది అవార్డులపై పెద్ద రచ్చ జరుగుతోంది. అవార్డు అందుకున్న వారు బాగానే ఉన్నప్పటికీ, రానివారు మాత్రం ఈ అవార్డులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఈ విషయంపై స్పందిస్తూనే ఉన్నారు. లెజెండ్ సినిమాకు గాను జగపతి బాబు ఉత్తమ విలన్ అవార్డ్ ను అందుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండే జగపతిబాబు ఈ నంది అవార్డులపై తనదైన రీతిలో స్పందించారు.

‘నా మొదటి సినిమా సింహస్వప్నం మూడు రోజులు ఆడింది. ఇక హీరో నుండి విలన్ గా మారి చేసిన లెజెండ్ సినిమాకు నంది అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక వివాదాలు అనేవి మీడియా సమస్య. నాకు వాటితో సంబంధం లేదు’ అంటూ రియాక్ట్ అయ్యారు. చాలా మంది ఈ వివాదంపై స్పందించడానికి ముందుకు రావడం లేదు. ఇటీవల ఓ స్పోర్ట్స్ బార్ ఓపెనింగ్ సంధర్భంగా మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్ కూడా ఈ విషయంపై రియాక్ట్ అవ్వడానికి ఒప్పుకోలేదు.