HomeTelugu Trendingవార్నర్‌ 'పోకిరి' డైలాగ్‌.. పూరి ట్వీట్‌.. వైరల్

వార్నర్‌ ‘పోకిరి’ డైలాగ్‌.. పూరి ట్వీట్‌.. వైరల్

2 9
కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. సెలెబ్రిటీలు వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులకు టచ్‌లో వున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తనకు సంబంధించి అప్‌డేట్స్‌ని ప్రతీ రోజు అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇప్పటికే ‘అల వైకుంఠపురం లో ‘ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ కు తన ఫ్యామిలీ తో కలిసి స్టెప్పులేసిన వార్నర్.. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమా డైలాగ్ తో అదరగొట్టాడు. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అని మహేష్ చెప్పిన డైలాగ్ ను వార్నర్ తనదైన స్టైల్ లో బ్యాట్ చూపిస్తూ చెప్పాడు.

‘ఈ డైలాగ్ ఏ సినిమాలోదో కనుక్కోండి. నేను అంతా వెతికాను కానీ నాకు దొరకలేదు’ అని కామెంట్ పెట్టాడు వార్నర్. దాంతో చాలా మంది మహేష్ బాబు పోకిరి సినిమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. పోకిరి సినిమా డైలాగులను అంత ఈజీగా మర్చిపోరు . మహేష్ తో పూరి చెప్పించిన డైలాగులు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. దానికి వార్నర్ టిక్ టాక్ వీడియో ఒక ఉదాహరణ అంటూ కామెంట్లు చేస్తున్నారు . ఇక వార్నర్ మహేష్ డైలాగ్ చెప్పడంతో మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోకిరి సినిమా ఇటీవలే 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టిక్‌టాక్‌పై ‘పూరి జగన్నాథ్‌ కూడా స్పందించాడు. ‘నీవు నటుడిగా కూడా రాణించగలవు. భవిష్యత్‌లో నా సినిమాలో అథితి పాత్ర ఇస్తా.. లవ్యూ’ ట్వీట్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu