HomeTelugu Trending'మహర్షి' సీన్స్‌తో డేవిడ్‌ వార్నర్‌ వీడియో

‘మహర్షి’ సీన్స్‌తో డేవిడ్‌ వార్నర్‌ వీడియో

David Warner with mahesh ba
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ ఆ వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటాడు. గతంలో కూడా మహేష్ పాటలకు స్టెప్పులు వేసి అదరగొట్టిన వార్నర్ తాజాగా మహేష్‌ బాబు డైలాగ్‌తో తనదైన స్టైల్‌లో న్యూ ఇయర్ బహుమతి అందించాడు. మహేష్ నటించిన ‘మహర్షి’ సినిమాలోని కొన్ని సీన్స్ సెలక్ట్ చేసుకొని రీఫేస్ యాప్ సహాయంతో ఓ వీడియోను రూపొందించాడు. మహేష్ ఫేస్‌కు బదులు తన ఫేస్ యాడ్ చేశాడు. మహేష్ చెప్పిన కొన్ని డైలాగులకు ఎక్స్‌ప్రెషన్లు కూడా ఇచ్చాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో మహేష్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది.

https://www.instagram.com/p/CJchnaAFUQO/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu