‘డియర్‌ కామ్రేడ్‌’ మూవీ ట్రైలర్‌ వచ్చేస్తుంది

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ అభిమానులకు శుభవార్త. ఆయన నటిస్తున్న ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా ట్రైలర్‌ ఈ నెల 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని విజయ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘మీరు మా సంగీతం విన్నారు. కొన్ని ప్రేమ, పగతో కూడిన సన్నివేశాల్ని చూశారు. ఇప్పుడు అన్నీ సీన్లతో కూడిన ట్రైలర్‌ 11న రాబోతోంది’ అని పేర్కొన్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో రష్మిక హీరోయిన్‌ గా నటిస్తున్నారు. భరత్‌ కమ్మ దర్శకుడు. జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి, యశ్‌ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘టాక్సీవాలా’ తర్వాత ఇది విజయ్‌ నటిస్తున్న చిత్రం. దీని తర్వాత ఆయన ‘హీరో’ అనే సినిమాలో నటించనున్నారు.