దీపావళికి గోపీచంద్ సినిమా ఫస్ట్ లుక్!

గోపీచంద్, బి.గోపాల్ కాంబినేష‌న్ రూపొందే యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ను జ‌య బాలాజీ రియ‌ల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో గోపీచంద్ సర‌స‌న అందాల తార న‌య‌న‌తార న‌టిస్తుంది. ఈ భారీ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ మూవీ టైటిల్, ఫ‌స్ట్ లుక్ ను దీపావ‌ళికి రిలీజ్ చేయ‌నున్నారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత తాండ్ర ర‌మేష్ మాట్లాడుతూ… ”గోపీచంద్, న‌య‌న‌తార‌, బి.గోపాల్ కాంబినేష‌న్లో ఈ మూవీ నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీపావ‌ళికి టైటిల్, ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియోను న‌వంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక చిత్రాన్ని డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌నున్నాం. క్లైమాక్స్ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. ఈ చిత్రానికి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ పెట్టాలనే ఆలోచ‌న‌లో ఉన్నాం. ఈ చిత్రంలో కోట శ్రీనివాస‌రావు, ప్ర‌కాస్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్ర‌క‌థ‌ను వ‌క్కంతం వంశీ అందించ‌గా సంభాష‌ణ‌ల‌ను అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. టాప్ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ తో రూపొందిస్తున్న ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకునేలా ఉంటుంది” అన్నారు.
CLICK HERE!! For the aha Latest Updates