HomeTelugu Big Storiesఆలియా-రణ్‌బీర్‌ పెళ్లి.. దీపికా-కత్రినా విషెస్‌.. వైరల్‌

ఆలియా-రణ్‌బీర్‌ పెళ్లి.. దీపికా-కత్రినా విషెస్‌.. వైరల్‌

Deepika and katrina wishes

బాలీవుడ్‌ ప్రేమజంట ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. గురువారం(ఏప్రిల్‌14)న రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. ఇక కొత్త జంటకు నెటిజన్లు సహా పలవురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రణ్‌బీర్‌ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌ దీపికా పదుకోణె, కత్రినా కైఫ్‌లు న్యూ కపుల్‌కి బెస్ట్‌ విషెస్‌ అందజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.

‘మీ ఇద్దరికి కంగ్రాట్స్‌. ఆల్‌ ది లవ్‌ అండ్‌ హ్యాపీనెస్‌’ అంటూ కత్రినా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా.. జీవితాంతం ప్రేమ, చిరునవ్వు, సంతోషం ఉండాలని కోరుకుంటున్నా అంటూ దీపికా పదుకొణె కామెంట్‌ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. కాగా ఆలియా కంటే ముందు రణ్‌బీర్‌.. దీపికా, కత్రినాలతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. దీపికా రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడితే, కత్రినా విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!