సెక్సియస్ట్ విమెన్ ఆఫ్ ఎషియాలో.. దీపికా, ప్రియాంక

యూకే కు చెందిన ఈస్టర్న్ ఐ వీక్లీ అనే మ్యాగజైన్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆసియా టాప్ 50 సెక్సియస్ట్ విమెన్ లిస్ట్ ను ప్రకటించింది. ఈ ఏడాది ప్రకటించిన లిస్ట్ చాలా ఇంటరెస్ట్ గా ఉండటం విశేషం. ఈ లిస్ట్ ప్రకారం దీపికా పదుకొనె టాప్ ప్లేస్ లో ఉన్నది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సోషల్ యాక్టివిటీస్ లో దీపికా ముందు వరసలో ఉన్నది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ను వివాహం చేసుకున్న తరువాత ఈ లిస్ట్ వెలువడటం విశేషం. ఇది దీపికకు మానసికంగా బలాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

దీపికా తరువాత సెకండ్ ప్లేస్ లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నిలిచింది. ప్రియాంక కూడా ఈనెల 2 వ తేదీన హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్నది. మూడో ప్లేస్ లో టీవీ నటి నియా శర్మ నిలవగా, నాలుగో ప్లేస్ లో పాకిస్తానీ నటి మహీరా ఖాన్ నిలిచింది. శివాగ్ని జోషి, అలియా భట్, సోనమ్ కపూర్, హీనా ఖాన్, కత్రినా కైఫ్, నీతి టైలర్ లు వరసగా తరువాత స్థానాల్లో ఉన్నారు.