
Deepika Padukone Controversy:
ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ దీపికా పదుకోణె. ఆమె పేరే ఎక్కడ చూసినా న్యూస్‌లో ఉంది. మొదటగా ప్రభాస్ – సందీప్ వంగా కాంబోలో రూపొందుతున్న స్పిరిట్ సినిమా నుంచి ఆమె వెనక్కి తగ్గడం పెద్ద షాకే. ఆ తర్వాత మరొక విషయం వైరల్ అయ్యింది – దీపికా PR టీం సందీప్ వంగా మీద నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారట!
అయితే దీపికా మాత్రం దీనిపై నేరుగా ఏం మాట్లాడలేదు కానీ… వోగ్ అరేబియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయి. “నిజాయితీగా ఉండటం, నా అంతరాత్మను వినటం నాకు శాంతిని ఇస్తాయి. కష్ట సమయంలో కూడా నా నిర్ణయాల మీద నమ్మకం పెడతాను” అని ఆమె చెప్పింది. ఆమె ఎవరైనా పేర్లు ప్రస్తావించలేదు కానీ, ఈ మాటలు చూస్తే అందరికీ ఒక్కటే డౌట్ వస్తోంది – ఇది సందీప్ వంగా మీద అనుకోవచ్చా?
దీపికా ఆ మాటలు చెప్పిన తీరును చూస్తే, ఆమె చాలా కూల్‌గా, క్లాస్‌గా స్పందించింది అనిపిస్తోంది. తను తప్పు చేయలేదన్న ఉద్దేశంతోనే అంతలా ఓపికగా మాట్లాడినట్టు ఫీల్ అయ్యింది. అయినా కూడా, ఆమె PR టీం చేసే పనులు మాత్రం పరిస్థితిని ఇంకొంచెం రఫ్ చేస్తున్నాయి అనేది గాసిప్స్.
ఇంకా సందీప్ వంగా ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఆయన ఎప్పుడు రియాక్ట్ అవుతారో చూడాలి. అప్పటివరకు దీపికా స్టేట్‌మెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ కథ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!
ALSO READ: Spirit Movie కోసం తృప్తి దిమ్రి రెమ్యూనరేషన్ ఇంత తక్కువా?