దేవదాస్‌ ఆడియో విడుదల డేట్‌ ఫిక్స్‌..!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘దేవదాస్’. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయిన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తున్నది. ఇప్పటికే నాలుగు సింగిల్స్ రిలీజ్ అయ్యాయి. నాలుగు కూడా సూపర్ గా ఉండటంతో పాజిటివ్ టాక్‌ క్రియేట్ అయింది. మణిశర్మ అందించిన సంగీతం ఆకట్టుకున్నాయి.

కాగా ఈ సినిమా సెప్టెంబర్ 27 న విడుదల కాబోతున్నది. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను సెప్టెంబర్ 20 వ తేదీన భారీ ఎత్తున నిర్వహించేందుకు నిర్మాత సి అశ్విని దత్ ప్లాన్ చేస్తున్నాడు. మహానటి తరువాత నిర్మిస్తున్న సినిమా ఇదే కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఈ చిత్రంలో రష్మిక, ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.